జగన్ రాంగ్ స్టెప్ కోలుకోలేని షాక్

జగన్ రాంగ్ స్టెప్ కోలుకోలేని షాక్

0
54

మొత్తానికి ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం అయితే స్టార్ట్ అయింది.. ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో చేరుతాడు అనేది తెలియడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య గట్టి పోటీ అయితే కనిపిస్తోంది. చివరి నిమిషంలో జగన్ వేసే రాంగ్ స్టెప్ లు పార్టీకి చాలా మైనస్ అవుతున్నాయి అంటున్నారు నేతలు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇలాంటి రాజకీయం కనిపిస్తోంది. పాలకొల్లులో వైసీపీలో వర్గపోరు ఉంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు, అలాగే ప్రస్తుత వైసీపీ సమన్వయకర్త గుణ్ణం నాగబాబుకి మధ్య వర్గపోరు ఉంది.. ఇరువురిలో ముందు నుంచి జగన్ గుణ్ణం నాగబాబుకి టికెట్ ఇస్తాను అని హామీ ఇచ్చారు…ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం నాగబాబు కష్టపడ్డారు. అయితే చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి బాబ్జి వైసీపీలో చేరడంతో, ఆయనకు సపోర్ట్ చేయాలి అని పాలకొల్లు వైసీపీకేడర్ కు ఆదేశాలు వచ్చాయి.

ఇక వైసీపీ తరపున పాలకొల్లు టికెట్ ఆయనకు కేటాయించడంతో ఇప్పుడు నాగబాబు వర్గం రివర్స్ అవుతోంది. ఈ సమయంలో జనసేనలో తెలుగుదేశంలో నాగబాబు చేరడానికి లేదు, ఎందుకు అంటే అక్కడ ఇప్పటికే సీట్లు ఫిక్స్ అయ్యాయి.. దీంతో నాగబాబు రాజకీయ భవితవ్యం డైలమాలో పడింది. యంగ్ జనరేషన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అవకాశమిస్తే తప్పకుండా పాలకొల్లు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. బాబ్జి..దీంతో ఆయనకు జగన్ కూడా హామీ ఇచ్చారని పార్టీ తరపున మీరే అభ్యర్దని చెప్పడంతో ఆయన పోటికి ఈసారి ఉంటారని తెలుస్తోంది. ఇది జగన్ వేస్తున్న రాంగ్ స్టెప్ అని, అక్కడ వైసీపీ నేతలే అంటున్నారు. దీంతో వైసీపీకి ఇక్కడ మరోసారి అపజయం ఖాయం అని అంటున్నారు పార్టీ నేతలు.