కేసిఆర్ పై రెచ్చిపోయిన వైఎస్ షర్మిల | ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? YS Sharmila fire on Kcr

0
42

తెలంగాణ సిఎం కేసీఆర్ పై మరోసారి తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ షర్మిల. మీ ఛాతిలో ఉన్నది గుండెనా.. బండనా అంటూ ఆమె తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో స్టాఫ్ట్ నర్సులుగా సెలెక్ట్ అయ్యి, పోస్టింగులు పొందలేకపోయిన అభ్యర్థులతో బుధవారం షర్మిల వీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

పీఆర్సీ నివేదిక ప్రకారమే వైద్య, ఆరోగ్యశాఖలో 23,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కోవిడ్ సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని వైఎస్.షర్మిల ప్రశ్నించారు. అటు.. సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులంతా ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్య పడొద్దని షర్మిల భరోసానిచ్చారు. మీ తరుపున నేను పోరాడుతానని బాధిత అభ్యర్థులకు ఆమె హామీ ఇచ్చారు.

వీడియా కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పై వై.ఎస్ షర్మిల ఎలా విరుచుకుపడ్డారో కింద లింక్ ని క్లిక్ చేసి చూడండి.

https://youtu.be/_l7WUYfbFvc