తెలంగాణలో వైయస్ షర్మిల నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం ఆ రోోజే

YS Sharmila's new political party launching date final

0
120

తెలంగాణలోో వైయస్ షర్మిల పెట్టబోతున్న పార్టీ పేరు దాదాపు ఖరారు అయింది. వైయస్ షర్మిల అధికారికంగా ప్రకటన చేయక పోయినా ,ఎన్నికల కమీషన్ సమాచారం మేరకు పార్టీ పేరు వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ అని స్పష్టత వచ్చింది. వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ తేది గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వైయస్ అభిమానులు .

రాజన్న సంక్షేమ పాలనను తెలంగాణలోని ప్రతి గడపకు తిరిగి అందించడానికి ఒక గొప్ప సంకల్పంతో, మహానేత వైయస్ఆర్ జయంతి రోజైన జులై 8న వైయస్ షర్మిల నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావించబోతున్నారు అని సమాచారం.

వైయస్ షర్మిల నూతన రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా ఈ నెల 9వ తేదీ ఉదయం 9:30 గంటలకు లోటస్ పాండ్ లోని వైయస్ షర్మిల కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహిసున్నట్లు వైయస్ షర్మిల అనుచరులు తెెలిపారు.