Breaking news: వైయస్ విజయమ్మ రాజీనామా

0
117

ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ వైసిపి గౌరవ అధ్యక్షరాలి పదవికి రాజీనామా చేశారు. నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నా, నా కూతురు షర్మిలమ్మకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైయస్ విజయమ్మ ప్రకటించారు. అయితే తల్లిగా జగన్ కు అండగా ఉంటానని చెప్పారు.

ఈ సందర్బంగా ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ..నా జీవితంలో ప్రతి మలుపు ప్రజాజీవితాలతో ముడి పడి ఉందని వైఎస్ఆర్ చెబుతుండేవారు. రాజశేఖర్ రెడ్డి నా వాడే కాదు..మీ అందరీ వాడుమీ అందర్నీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాను. రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడతాయి.. వైఎస్‌ఆర్‌ సీపీ నల్ల కాలువ దగ్గర ఇచ్చిన మాట కోసం పుట్టింది.

వైఎస్ఆర్ లేడని తెలిసి 700 మంది ప్రాణాలు వదిలారు. కోట్లాది మంది అభిమానం నుంచి వైఎస్ఆర్ సీపీ పుట్టింది. దేశంలోని వ్యవస్థలు అన్నీ దాడి చేసినా..మనం చేస్తున్నది న్యాయం, ధర్మం అని..కష్టాలు బాట ముందని తెలిసినా కూడా కన్నీళ్లను తుడవటానికి వైఎస్ఆర్ సీపీ పుట్టింది. ఎన్నో కష్టాలను, నిందలను ఎదుర్కొని వైఎస్ఆర్‌ కుటుంబం నిలిచింది.

అధికార శక్తులన్నీ జగన్‌ పై విరుచుకుపడ్డ బెదరలేదు. ఎన్నో విలువలు, మానవత్వంతో వైఎస్ఆర్‌ సీపీ పురుడు పోసుకుంది. నిజాయితీగా ఆలోచన చేసే వ్యక్తిత్వం జగన్ ది. లక్షా 60 వేల కోట్లు ప్రజలకు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అందించింది. గడపగడపకు ఎమ్మెల్యేలను పంపుతున్నాడంటే..తాను మంచి చేశానని నమ్మడం వల్లనే పంపుతున్నాడు.

నాడు – నేడుతో బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. మానవత్వంతో, మనసుతో చేసే పాలన. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు దిగారు. పరిపాలనలో జగన్ విప్లవం తెచ్చారు. జగన్‌ చెప్పినవే కాకుండా…చెప్పనవి కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో పేద తల్లులు, పేద తండ్రులు మీ బిడ్డలను జగన్ చేతిలో పెట్టండి…జగన్ మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్ చూసుకుంటారు. రైతుల కలలను జగన్ నెరవేరుస్తాడు

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వైఎస్ జగన్ మాస్ లీడర్‌. దుర్గ ఫ్లైఓవర్‌ను చంద్రబాబు ఐదేళ్లో పూర్తి చేయలేకపోయారు. జగన్ సీఎం అయ్యాక పూర్తి చేశారు. జగన్‌ యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమను పొందిన జగన్‌ను గర్వపడుతున్నా. కడప ప్రజలు మొదటి నాతో ఉన్నందకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రం వైఎస్ఆర్‌ను మహామనిషిని, మహర్షిని చేసింది.

రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నిత్యం ఏం చేయాలి..ఏం చేయాలని ఆలోచించేవారు. వైఎస్ఆర్‌ అంటే ప్రజలకు ప్రాణాలు పోయేంత ప్రేమ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పరిపాలనలో సీఎం జగన్ విప్లవం తెచ్చారు. ప్రజలకు, వైఎస్ కుటుంబానికి 45 ఏళ్లు. ఇకపై కూడా నా అనుబంధం కొనసాగాలి. జగన్‌ మనసుతో చేసే పాలన నా కళ్లారా చూస్తున్నా అని విజయమ్మ చేప్పారు.