జగన్ చంద్రబాబుల మధ్య వ్యత్యాసం ఇదే…

జగన్ చంద్రబాబుల మధ్య వ్యత్యాసం ఇదే...

0
100

టీడీపీ నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేస్తున్నారని శోకాలు పెడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు… అమరావతి చుట్టూ కొన్న భూముల ధరలు పడిపోవడం, వర్క్ ఆర్డర్లు లేకున్నా సిమెంట్ రోడ్లు వేసిన వారి బిల్లులు ఆగాయని, పోలవరం, హంద్రీనీవా కాంట్రాక్టర్ల తొలగింపు గురించే ఆయన ఆందోళన అంతా అని వియజసాయిరెడ్డి అన్నారు….

గోదావరి నుంచి బోటును వెలికి తీసిన దర్మాడి సత్యం నైపుణ్యం, ఆయన పడిన శ్రమ గురించి దేశమంతా ప్రశంసల వర్షం కురుస్తోందని అన్నారు.. అయితే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగి ఉంటే ఆయన పేరు ఎవ్వరికీ తెలిసేది కాదని అన్నారు.

బాబే దగ్గరుండి డైవర్లకు గైడెన్స్ ఇచ్చి గొలుసులు వేసి పడవను బయటకు లాగాడని కుల మీడియా బాకాలూదేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు..