బీజేపీకి తేల్చి చెప్పిన జగన్ నో డౌట్

బీజేపీకి తేల్చి చెప్పిన జగన్ నో డౌట్

0
103

ఏపీలోఈసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని తెలుస్తోంది.. ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ తో కలిసి ముందుకు వెళ్లాలి అని కేంద్రంలో చక్రం తిప్పాలి అని భావిస్తున్న వారు కోరుకుంటున్నారు.. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ తో అవసరం ఉంటుంది కాబట్టి పెద్ద విమర్శలు చేయడం లేదు, బీజేపీ మాత్రం దోబూచులాట ఆడుతోంది. జగన్ తో రహస్య ఒప్పందం లేదు బహిరంగ ఒప్పందం బీజేపీతో లేదు అనేది తెలిసిందే.. అయితే అమిత్ షా మోదీ ఇద్దరూ కూడా ఏపీలో జగన్ గెలిస్తే కచ్చితంగా సపోర్ట్ చేయాలి అని అడుగనున్నారు.

అయితే దీనికి జగన్ కూడా ఒక కండిషన్ పెట్టనున్నారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము అని చట్టబద్దతగా చెబితే కచ్చితంగా సపోర్ట్ చేస్తాము అని జగన్ చెప్పనున్నారు.. ఇప్పుడు ఇదే పెద్ద ఆలోచనగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా నిజంగా జగన్ సాధిస్తే మరో రెండు మూడు టెర్ములు ప్రచారం చేయకుండా సీఎం అవ్వచ్చు.. నిజంగా మోదీ దీనికి గాని అనుకూలంగా ఉంటే కచ్చితంగా ఇది జగన్ కు ఓ సువర్ణ అవకాశం అనే చెప్పాలి.. మరి చూడాలి బొటా బొటీగా బీజేపీకీ సీట్లు వస్తే కచ్చితంగా జగన్ తన మాటమీద పట్టువదలకుండా కూర్చుంటారు అని తెలుస్తోంది.. బీజేపీకి 5 నుంచి 8 సీట్లు వచ్చినా పెద్ద పరిగణలోకి బీజేపీ తీసుకోదు అంటున్నారు విశ్లేషకులు.