2019 ఎన్నికల్లో గెలిచినా తర్వాత వైసీపీ నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టింది .గ్రామా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం దగ్గరనుంచి ,గ్రామా సచివాలయ ఉద్యోగాల వరకు ప్రతి ఒక్కటి ఇందులోని భాగమే . అయితే ఇప్పుడు సర్కార్ మరో అడుగు ముందుకు వేయబోతుందని తెలుస్తుంది
లొక్డౌన్ కారణముగా ఉపాధి కోల్పోయిన చాల మందిలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు .ఇప్పుడు ఈ ఉపాధ్యాయులకు కాస్త ఊరట కలిగించేవిదంగా 2018 డీఎస్సి పోస్టులను భర్తీ చేయాలనీ సర్కార్ నిర్ణయం తీసుకుంది . అలాగే 2020 నూతన నోటిఫికేషన్ ని కూడా త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతుంది .
2018 కి సంబందించిన 3524 డిఎస్సి పోస్టులను ఈ నెల 28 లోపు భర్తీ చేయబోతుంది . విద్యాదీవెన లాంటి పథకాల విషయం లో ఇప్పటికే అభివృద్ధి దిశలో సాగుతున్న సర్కార్ ..ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం పై చాల మంది నిరుద్యోగులకు ఒక ఆసరా లభించినట్లే అని , ఇలాంటి నిర్ణయాల వల్లే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు .