గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్

గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్

0
35

ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే అన్నీ పథకాలు చేరుతున్నాయి, దీని వల్ల యువతకు ఉపాధి వచ్చింది ప్రజలకు ఏ సమస్య లేకుండా అన్నీ సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయి, అంతేకాదు ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పనిలేకుండా ఉంది.

దీంతో చాలా మంది ఈ వ్యవస్ధపై ప్రశంసలు కురిపిస్తున్నారు, దేశంలో ఒకేసారి సీఎం అయిన వెంటనే ఏడాదిలో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కింది, తాజాగా
గ్రామ, వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సేవలను మరో ఏడాది పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇక ఇప్పటికే వారు చేరి ఓ ఏడాది అవుతోంది, మరో ఏడాది వారి సేవలను పొడిగించారు.
2.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల సేవలను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం దీని కోసం మరో 1560 కోట్ల రూపాయల మేర గౌరవ వేతనం కింద చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.