ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ రాజకీయంగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ నేడు ఈ ఉన్నత స్ధానానికి చేరుకున్నారు, ఆయన సొంతంగా తన తండ్రి పేరుతో పార్టీ స్ధాపించి ఇలా ముందుకు సాగుతున్నారు.
అలాంటి వైసీపీ పుట్టి నేడు పదో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది, దీంతో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుతున్నారు వైసీపీ నేతలు… పైగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కావడంతో మరింత ఆనందంతో ఈ పండుగ చేసుకుంటున్నారు, ఈ సమయంలో సీఎం వైయస్ జగన్ కూడా దీనిపై ట్వీట్ పెట్టారు.
మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన @YSRCParty 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీఅందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు, దీంతో ఆయన కు పార్టీ నేతలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షల వెల్లువ వస్తోంది.