కరెక్ట్ టైంలో జగన్ కి జై కొట్టిన జేసీ

కరెక్ట్ టైంలో జగన్ కి జై కొట్టిన జేసీ

0
89

మూడు రాజధానుల ప్రకటన పై ప్రదాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వామపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ మూడు రాజధానులపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పందించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఇంతచిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు తీసుకురావడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు… కానీ శాసనసభా తీర్పును అందరు గౌరవించాల్సిందేనని అన్నారు… మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అంతసులభతరం కాదని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి…

మనిషికి తలకాయ రాజధాని అయితే బ్రెయిన్ సెక్రటేరియట్ అని అన్నారు… బ్రేయిన్ తీసుకువెళ్లి జగన్ విశాఖపట్నంలో పెడుతున్నారని జేసీ పేర్కొన్నారు… దేశంలో కేంద్రం కోర్టులు ఉన్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు…