బ్రేకింగ్ – సీఎం జ‌గ‌న్ వ్యూహం అందిరింది – వారిద్ద‌రికి కీల‌క ప‌ద‌వులు ?

బ్రేకింగ్ - సీఎం జ‌గ‌న్ వ్యూహం అందిరింది - వారిద్ద‌రికి కీల‌క ప‌ద‌వులు ?

0
109

శ్రావ‌ణం వ‌చ్చేస్తోంది ఈ స‌మ‌యంలో రాజ‌కీయంగా శ్రావ‌ణ మేఘాలు అల‌ముకుంటున్నాయి, ఇవి ఎవ‌రికి ప్ల‌స్ అవుతాయి అని చాలా మంది చూస్తున్నారు, ఎందుకు అంటే రెండు మంత్రి ప‌ద‌వుల‌తో పాటు
ఎమ్మెల్సీ పదవుల భర్తీపై వైఎస్సార్‌సీపీ ఫోకస్ పెట్టింది.. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.. రోజుకో పేరు తెరపైకి వస్తోంది.

రెండు గవర్నర్ కోటాలోని పదవుల కోసం పోటీ పెరిగింది, తాజాగా తెర‌పైకి చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు దాదాపు ఖరారు అయిన‌ట్లు తెలుస్తోంది.. రెండో స్థానం కోసం అధిష్టానం ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ భార్య జకియా ఖాన్.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే వీరిద్ద‌రిలో ఎవ‌రికి సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు అనేది ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.
గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్ చిలకలూరిపేట సీటు త్యాగం చేశారు అక్క‌డ వైసీపీ గెలుపుకి కృషి చేశారు అందుకే ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు. నేడు దీనిపై క్లారిటీ రానుంది.