జగన్ బాబాయ్ కి బంపర్ ఆఫర్

జగన్ బాబాయ్ కి బంపర్ ఆఫర్

0
103

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ ని రాజకీయంగా పక్కన పెట్టారా.. అందుకే ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వలేదా.. జగన్ అంత నమ్మకంగా ఉన్న తన బాబాయ్ ని రాజకీయంగా ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడానికి కారణం ఏమిటి అని ఎల్లో మీడియా వార్తలు ప్రచారం చేస్తోంది, కాని వైవీ పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉన్నా, గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లాలో ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్నారట. ఆయన వెనుక నుంచి రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తున్నారు.. సీనియర్ గా రాజకీయంగా ఆయన సలహాలు అందిస్తున్నారు.

ఎక్కడా అసంతృప్తులు లేకుండా చూస్తున్నారు పార్టీ తరపున వైవీ సుబ్బారెడ్డి.. జగన్ ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తాము అని చెప్పారు.. కాని కొందరు ఎల్లోమీడియా ద్వారా ఆయన పై దుష్ప్రచారం చేస్తున్నారు అని, వైవీ వైసీపీలో ఉన్నారు, జగన్ కు ఎన్నికల వేళ సాయం చేస్తున్నారని చెబుతున్నారు వైసీపీ సీనియర్లు. అయితే ఎల్లో మీడియా వార్తలు ఎవరూ నమ్మక్కర్లేదని ఎన్నికల వేళ ఇవన్నీ స్టంట్ లు అని కొట్టిపారేస్తున్నారు.