జమ్మలమడుగులో జగన్ సంచలన నిర్ణయం

జమ్మలమడుగులో జగన్ సంచలన నిర్ణయం

0
62

వైయస్ వివేకానందరెడ్డి మరణంతో వైయస్సార్ శ్రేణులు కాస్త ఢీలా పడ్డారు, ముఖ్యంగా జగన్ ఎంత బాధ ఉన్నా ఆయన ఎన్నికల ప్రచారంలోపాల్గొంటున్నారు.. మానసికంగా కృంగదీయాలి అని అనుకున్నా, ఆయన మాత్రం పట్టుదలతో ముందుకు వెళుతున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక పులివెందులలో వార్ వన్ సైడ్ అనేది తెలిసిందే ..సతీష్ రెడ్డి కేవలం నామినేషన్ వేయడం ప్రచారం చేయడమే ఈసారి కూడా చేస్తారు అని ఓట్లు జగన్ కుపడతాయి అని అంటున్నారు నేతలు. గతంలోకంటే
ఇక్కడ జగన్ మరింత మెజార్టీతో ఈసారి గెలుపొందడం పక్కా అంటున్నారు.

అయితే జమ్మలమడుగు స్ధానంలో కూడా ఈసారి జగన్ డాక్టర్ సుధీర్ రెడ్డిని ఎన్నికల బరిలో ఉంచారు.. సుధీర్ రెడ్డిని గెలిపించే బాధ్యతలను వైయస్ వివేకాకు జగన్ అప్పగించారు అని అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆయన లేరు ఇక్కడ వైయస్ కుటుంబం మంచి పేరు సంపాదించుకుంది. అందుకే ఇక్కడ వైయస్ విజయమ్మ షర్మిల ప్రచారం రెండు రోజులు సుధీర్ రెడ్డితో కలిసి చేయనున్నారట.. ఈ నిర్ణయంతో వైసీపీ నేతలు జోష్ లో ఉన్నారు. ఇలా ప్రచారం చేస్తే పార్టీకి మరింత పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది అని అంటున్నారు పార్టీ శ్రేణులు.