నాగార్జునకు కొత్త ఆఫర్ విని షాకైన నాగ్

నాగార్జునకు కొత్త ఆఫర్ విని షాకైన నాగ్

0
52

బాలీవుడ్ నుంచి బిగ్ బాస్ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా తెలుగు తమిళ్ కన్నడలో ఎంటర్ అయింది.. ఇక తెలుగులో రెండు సీజన్లు సక్సెస్ గా పూర్తి అయ్యాయి. అయితే ఈసారి మూడవ సీజన్ కు హోస్ట్ గా ఎవరు ఉంటారు అనేది పెద్ద చర్చ జరుగుతున్న అంశం. తొలి ఎపిసోడ్ ఎన్టీఆర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇప్పించారు, ఆయన మొదటి సీజన్ కు హోస్ట్ గాచేశారు, ఇక సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. షో మొదటి ఎపిసోడ్ సుమారు 16.18 టీఆర్పీ చేరుకుంది. ఇదే ఇప్పటి వరకూ రికార్డు.

ఇక నాని చేసిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05, టీఆర్పీ నమోదుచేసింది.. అయితే ఇప్పుడు మూడవ సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారు అనేదానిపై చర్చ నడుస్తోంది.మరోసారి ఎన్టీఆర్ ని తిరిగి తీసుకురావాలి అని చూసినా ,ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం రాజమౌళితో చేస్తుండటం, ఆర్ ఆర్ ఆర్ కాల్షిట్లు బీజీగా ఉండటం పైగా అందులో లుక్ డిఫరెంట్ గా ఉండాలి అనే కారణంతో ఆయన ఈ ఛాన్స్ వదులుకున్నారట. ఇక ఇప్పుడు నాగార్జునను బిగ్ బాస్ టీం ఎంచుకుంది అని , ఆయనని ఎలాగైనా ఈసారి హోస్ట్ చేయించాలి అని చూస్తోందట. ఇక జూన్ లో మూడవ సీజన్ స్టార్ట్ చేయనున్నారు, ఎక్కడ సెట్ వేయాలి..కంటెస్టెంట్స్ ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మరి దీనిని నాగ్ ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.