ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి భాద్యతలను చేపట్టిన నాటినుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు… ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆయన వాటిని పక్కన పెట్టి నేరుగా ప్రజా పాలన చేస్తున్నారు… ఈ క్రమంలో సీఎం జగన్ కుప్పం సెగ్మెంట్ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి…
గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడును ఓడించాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు… కానీ 10 వేలకు పైగా మెజార్టీని తగ్గించారు.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఎలాగైనా ఓడించాలనే కృత నిశ్చయంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఇళ్ల పట్టాలను ఇచ్చేందు సిద్దమైన జగన్… దీనికి సంబంధించి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సాధించితీరాలని నిర్ణయించారు..
ఫలితంగా చంద్రబాబు ఓటు బ్యాంక్ తారుమారు అయ్యే ఛాన్స్ ఉంటుంది… ఇదే క్రమంలో అభివృద్ది ఆమడ దూరంలో ఉన్న కొన్ని గ్రామాల్లో త్రాగు నీరు విద్యుత్ సమస్యలను పరిస్కరించనున్నారు… వీటన్నింటి బాధ్యలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి… అయితే ఇన్ని జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించకున్నారు.. ఇదే విషయాన్ని సర్కార్ నాయకులు విసృతంగా ప్రచారం చేయాలని చూస్తున్నారట…