ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు… పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు… అంతేకాదు నవరత్నాల్లో పొందుపరచని హామీలను కూడా అమలుచేస్తూ జగన్ ప్రజల చేత ప్రశంశలు అందుకుంటున్నారు… ఆయన ఎట్టిపరిస్థిలో సంక్షేమ పథకాలను మాత్రం ఆపకున్నారు…
రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా కూడా రెండురోజులకు ఒక పథకాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు… అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం జగన్ నగదును ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు… వరుసగా ప్రతీ ఏడాది నిర్థేశించిన సమయంలో నగదును వారి బ్యాంక్ అకౌంట్ లలో జమచేస్తే దానికి ప్రజలు అలవాటు పడతారు… ప్రతీ ఒక్కరు నిధులు విడుదల అయ్యే నెల కోసం ఎదురు చూస్తారు… అంటే అర్హత ఉన్న లబ్దిదారు మరిచిపోరు…
ఇలా అలవాటు అయితే 2024 ఎన్నికల నాటికి వీరందరు వైసీపీ వైపు నిలబడతారని అంచనా వేస్తున్నారు… ఇక మిగిలిన సంవత్సరాలు కూడా అనుకున్న ప్రకారం లబ్దిదారు అకౌంట్ లలో నగదును జమ చేస్తే జనం పార్టీకి కనెక్ట్ అవుతారని భావిస్తున్నారట… జగన్ మోహన్ రెడ్డి వేసిని ప్లాన్ కు ప్రజలు కనెక్ట్ అవుతే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…