ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జైలుకు పంపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్లాన్లు వేస్తున్నారా అంటే అవుననే అంటున్నా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.
తాజాగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంచనా వేస్తూ చంద్రబాబు నాయుడును జైలుకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు… ఈక్రమంలో అనేక ఆరోపణలు చేస్తూ కమిటీలంటూ రచ్చ చేస్తోందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు…
కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడును జైలుకు పంపే ప్రయత్నాలు ఒండొచ్చు ఉండక పోవచ్చని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని జేసీ దివాకర్ రెడ్డి అంచనా వేశారు…