రెడ్డి గారు వేసిన స్కెచ్ కి ఆ ఎమ్మెల్యేలు పడతారా

రెడ్డి గారు వేసిన స్కెచ్ కి ఆ ఎమ్మెల్యేలు పడతారా

0
76

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం లోకి రావడం తో టీడీపీ ఒక్కసారిగా కుదేలయింది . అయితే టీడీపీ నాయకుల్లో చాల మంది వైసీపీ కి వలసలు మొదలు పెట్టడం తో టీడీపీ అనే కంచుకోట వైభవం పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది .. వైసీపీ లో బలగం పెరిగేకొద్దీ టీడీపీ బలహీనపర్వం మొదలయ్యింది .

అయితే ఇప్పుడు రాష్ట్రం లో టీడీపీ ప్రస్తావనే లేకుండా చెయ్యడానికి జగన్ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది . టీడీపీ లోని కమ్మ సామజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లను తమ పార్టీ లోకి లాగాలని చూస్తున్నట్టు తెలుస్తుంది .ప్రకాశం జిల్లా లో ఓటమి ల్లేని నాయకుడిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ , విశాఖ జిల్లాలో తన వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడి రామకృష్ణ లను వైసీపీ లో చేర్చుకుంటే రాష్ట్రం లో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకోవడం ఖాయమని వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది

అయితే ఇప్పటికే పార్టీ లో చేరకపోయిన జగన్ చెంత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు . అయితే విశాఖలో టీడీపీ లీడర్ గ ఉన్న వెలగపూడి కి వైసీపీ వెన్న పూసి లొంగదీస్తుందో ,లేక అతన్ని పార్టీ లోకి రప్పించలేక వెనుతిరుగుతుందో చూడాలి .