వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేతలు విమర్శలు చేయలేదు.. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేయలేదు.. అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఏపీలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాము అని చూస్తున్నాయి.. ఇటు బాబుకు మెజార్టీ వస్తే మళ్లీ బీజేపీ ముందుకు వస్తుంది.. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ ను కలుపుకునే ఆలోచనలో ఉంది.. అలాగే ఫ్రంట్ వేదికగా కేసీఆర్ చేస్తున్న రాజకీయం కూడా తెలిసిందే.. ఇలా కూడా ఆయన జగన్ తో మంతనాలు జరిపారు.. తమకు సపోర్ట్ కావాలి అని అడిగారు..
ఇలా మూడు వేదికలు జగన్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అయితే ఏపీ ఫలితాలు మాత్రం జగన్ కు పాజిటీవ్ అయితే ఏపీకి ప్రత్యేక హోదాఎవరు ఇస్తారో, వారికి సపోర్ట్ అంటూ ఆయన చెపుతారు.. జగన్ ఈ విషయం పై ఆలోచన చేయనవసరం లేదు అని , ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి అని చెబుతున్నారు. మొత్తానికి మూడు పార్టీల విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారట.