వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు పూర్తి వివరాలు ఇవే

వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు పూర్తి వివరాలు ఇవే

0
38

ఏపీలో వైయస్సార్ పెళ్లి కానుక ద్వారా ప్రభుత్వం పేద అమ్మాయిలకు వివాహాలకు సాయం చేస్తోంది,
ఇక వీటికి అర్హులైన వారు జిల్లాలోని వెలుగు మండల మహిళా సమాఖ్యల్లో పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీరు పెళ్లి తేదికి ఐదు రోజుల ముందు ఇలా అప్లై చేసుకోవాలి, లేకపోతే వారికి ఈపధకం వర్తించదు.

మరి ఈ పథకానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చూద్దాం
అమ్మాయి అబ్బాయి కచ్చితంగా ఏపీకి చెందిన వారు అయి ఉండాలి
ఇక అమ్మాయి వయసు 18 అబ్బాయి వయసు 21 ఉండాలి
ఇక వరుడు వధువు మొదటి సారి వివాహం చేసుకునే వారు అయి ఉండాలి
వధువు రెండో వివాహం చేసుకున్నా, మొదటి భర్త చనిపోయిన వితంతువుగా పరిగణించి అప్పుడు కూడా ఇస్తారు.
ఇక మీరు అప్లై చేసుకునే సమయానికి వివాహ తేది వేదిక కూడా ఫిక్స్ చేసుకుని వారికి తెలియచేయాలి
ఏపీ పరిధిలోని వివాహం జరగాలి.
ఇద్దరికి ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి
అమ్మాయికి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి.
మీసేవా కేంద్రం ద్వారా జారీ చేసిన కుల,నివాస, జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి
ఆమెకి కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలి.
అమ్మాయి అబ్బాయి అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికెట్ ఉండాలి.
వైఎస్ఆర్ పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరి అవి ఎంత వస్తాయో చూస్తే
ఎస్సీలు రూ.40 వేలు రూ.లక్ష
ఎస్సీ కులాంతర రూ.75 వేలు రూ.1.20 లక్షలు
గిరి పుత్రిక రూ.50 వేలు రూ.లక్ష
ఎస్టీ కులాంతర రూ.75 వేలు రూ.1.20 లక్షలు
బీసీలు రూ.35 వేలు రూ.50 వేలు
బీసీ కులాంతర రూ.50 వేలు రూ.75 వేలు
దుల్హన్ రూ.50 వేలు రూ.లక్ష
దివ్యాంగులు రూ.లక్ష రూ.1.50 లక్షలు
భవన నిర్మాణ కార్మికులకి 1 లక్ష