వైఎస్ జగన్ బాటలోనే వారు కూడా

వైఎస్ జగన్ బాటలోనే వారు కూడా

0
88

ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు టీడీపీ నేత లోకేశ్… ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలోనే వైకాపా నాయకులు నడుస్తున్నారని ఎద్దేవా చేశారు లోకేశ్… అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్దులు వదులుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వీఐపీలమంటూ వైసీపీ నాయకులు డాక్టర్ల కి ఇచ్చిన మాస్కులు కొట్టేయ్యడం దారుణం అని ఆరోపించారు…

వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు లోకేశ్. కరోనా నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రమేనని ఎద్దేవా చేశారు. కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితి లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు.. కరోనా నివారణకు నిధులు లేవు అని అధికారులు లేఖలు రాసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందొ అర్ధం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు…