వైసీపీలోకి దేవినేని అవినాష్ కీలక బాధ్యతలు

వైసీపీలోకి దేవినేని అవినాష్ కీలక బాధ్యతలు

0
88

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు… నేడు బాబు దీక్ష సమయంలోనే దేవినేని అవినాష్ సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు.సాయంత్రం నాలుగు గంటలకు జగన్ ను కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరిన తర్వాత వైసీపీ కార్యాలయం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు దేవినేని.

తెలుగుదేశం పార్టీలో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు గత ఎన్నికల్లో ఎన్నో ఆలోచనలు చేశారు చంద్రబాబు.. చివరకు గెలుపు రాని చోటుని సెలక్ట్ చేసుకుని గుడివాడ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించారు.. అయితే అక్కడ కొడాలి నాని గెలుపొందారు. ..ఇక అక్కడ పార్టీలో ఉండలేక కొద్ది రోజులుగా సతమతమవుతున్నారు, అయితే వైసీపీలో ఆయన చేరేందుకు చర్చలు జరిపి పార్టీలోకి సుముఖత చూపించారు.. అయితే దేవినేనికి కీలక బాధ్యతలు కూడా ఇస్తోంది వైసీపీ …విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ గా అవినాష్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే అక్కడ బొప్పన భవకుమార్ ఉన్నారు. ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి తూర్పు బాధ్యతలను అవినాష్ కు అప్పజెప్పాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.