వైసీపీలోకి తెలుగు టాప్ డైరెక్టర్ ఫ్యామిలీ…

వైసీపీలోకి తెలుగు టాప్ డైరెక్టర్ ఫ్యామిలీ...

0
100

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అతి కొద్దిమంది మాత్రమే కలిశారు… అందుకే ఇటీవలే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఏపీకి సీఎం… జగన్ అవ్వడం ఇండస్ట్రీకి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… అయితే ఇటీవలే చిరంజీవి తన సతీమనితో కలిసి తాడేపల్లిలో జగన్ నివాసంలో కలిశారు… తాను నటించిన చిత్రం సైరా చూడాలని కోరాలు ఆ తర్వాత టాప్ డైరెక్టర్ వీవీ వినాయక్ జగన్ ను కలిశారు…

ఇప్పుడు వీవీ వినాయక్ జగన్ ను కలవడంపై చర్చ సాగుతోంది….. వినాయక్ తన కుటుంబం రాజకీయ భవితవ్యం గురించి చర్చించడానికే జగన్ ను కలిశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరికొద్దిరోజుల్లో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వినాయక్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే వినాయక్ మాత్రం ఇది కేవలం మర్యాదపుర్వంగా కలిశానని అంటున్నారు…