ఏబీఎన్ పై కోర్టుకు జగన్ సంచలన నిర్ణయం

ఏబీఎన్ పై కోర్టుకు జగన్ సంచలన నిర్ణయం

0
93

తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ జగన్ పై నిత్యం ఆరోపణలు విమర్శలు చేసే ఛానల్ గా ఏబీఎన్ పై వైసీపీ విమర్శలు చేస్తుంది. బాబు ఛానల్ అని తూర్పారపెడతారు వైసీపీ నేతలు, కావాలనే జగన్ పై నిత్యం విమర్శలతో కూడిన అసత్య వార్తలు రాస్తారు అని విమర్శిస్తారు.. తాజాగా జగన్ పై ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడం పై రాజకీయ నేతలతో పాటు ఏపీలో రహస్య అజెండా అనే శీర్షిక వార్తగా రాశారు ఇదంతా జగన్ సర్కార్ పై విమర్వలతో ఉంది

ఈ వార్తా వ్యాసంపై కోర్టుకు వెళతామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మతం మారతారని కొత్త పలుకులో రాశారు. ఇది అసత్య ప్రచారం అని అన్నారు విదేశాలలో చదువుకున్న వారు మతం మారిపోయారా.. జగన్ తీసుకున్న నిర్ణయంపై కావాలనే ఇలా బురధ జల్లుతున్నారు అని ఆయన విమర్శించారు.