ఈ వైరస్ డేంజర్ బెల్ మోగిస్తోంది, ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి… సర్కారు కూడా ప్రతీ ఒక్కరికి ఇదే చెబుతోంది, అయితే ఇప్పుడు లాక్ డౌన్ పై రేపు ఉదయం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు, ఈ సమయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఏమిటి ఏ ప్రకటన ఉండబోతోంది అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
అయితే తాజాగా తెలుస్తున్న వార్తలు వినిపిస్తున్న వార్తలు చూసుకుంటే దేశ వ్యాప్తంగా సగం జిల్లాలో కరోనా ప్రభావం లేదు, దీంతో ఆ ప్రాంతాలను ఆ జిల్లాలకు ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ ఎత్తివేయాలి అని చూస్తున్నారు, అయితే ఆ జిల్లాల్లోకి ఎవరిని బయట వారిని అనుమతించకుండా వారి పనులు వారు చేసుకునేలా చేయనున్నారట.
రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా కొన్ని ఏరియాలను ప్రకటిస్తారు, ఆ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత బట్టీ ఆ ఏరియాకీ రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్లు గా తెలియచేస్తారు, అయితే రెడ్ జోన్ అంటే డేంజర్ జోన్, ఇక ఆరెంజ్ జోన్ అంటే కాస్త ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతం, గ్రీన్ జోన్ అంటే ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలుగా చెబుతున్నారు, ఈ జోన్ల ప్రకారం ఆంక్షలు విధిస్తారట.