5.5 లక్షలకే ఎకరం భూమి : క్లియర్ టైటిల్… ఎక్కడంటే ?

0
93

రో్జురోజుకూ భూముల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వ్యవసాయం చేసే వారే కాదు… చేయని వారు సైతం భూములు కొనుగోళ్లకు దిగుతుండడంతో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతులు వ్యవసాయం చేయడం కోసమే భూములు ఉంచుకుంటారు. కానీ మిగతా వర్గాల వారు ఇన్వెస్ట్ మెంట్ పర్పస్ లో భూములు కొనుగోలు చేస్తున్నారు. వీరి తాకిడి పెగడంతో రైతుల వద్ద భూములు మిగలడంలేదు. ఇన్వెస్ట్ మెంట్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ మంది భూములు కొనుగోళ్లకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్వయసాయ భూములను కొనుగోలు చేసే చాన్స్ కల్పిస్తున్నది శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో 103 ఎకరాల వ్యవసాయ భూమి 5.5 లక్షల లోపే అమ్మకానికి ఉందని శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ సంస్థ వారు వెల్లడించారు. క్లియర్ టైటిల్ తోపాటు ఏ రకమైన లీగల్ వివాదాలు లేని భూమి అని తెలిపారు. తెలంగాణలో ఎకరం ధర 30లక్షలకు చేరుకున్న పరిస్థితుల్లో ఇక్కడ భూములు కొనలేక ఇబ్బంది పడేవారు ఆంధ్రాలో కొనుగోలు చేయండి అని చెబుతున్నారు.

సామూహిక వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్న వారు నిర్భయంగా వచ్చి కొనుగోలు చేయవచ్చంటున్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాము వాటి బాధ్యతలు చేపడతామని భరోసా ఇస్తున్నారు. దీంతో ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండాలని ఆశపడేవారు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నట్లు శ్రేయోభిలాషి అగ్రి డెవలపర్స్ సంస్థ ప్రతినిధి బొడ్డు శ్రీనివాస్ తెలిపారు.

కొంచెం దూరమైనా సరే… క్లియర్ టైటిల్, సెక్యూరిటీ, సేఫ్టీ విషయంలో తాము భరోసా ఇస్తుండడంతో కస్టమర్లు ల్యాండ్ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. 103 ఎకరాల ల్యాండ్ లో ఇప్పటికే రోడ్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి నల్లగొండ, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి ల్యాండ్ చూసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు.

మొత్తం ల్యాండ్ అమ్మకం పూర్తయిన తర్వాత కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి పంటలు వేయాలి? ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఏ పంటలకు ఆ భూములు అనుకూలంగా ఉన్నాయో గుర్తించి తదుపరి ఆయా పంటలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. రైతులే కాకుండా అన్ని వర్గాల వారు భూములు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నట్లు వివరించారు.