భూముల ధరలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

0
114

భూముల మార్కెట్ విలువలను పెంచుతూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విలువలు ఎల్లండి నుంచి అమలులోకి రానున్నాయి. రేపు రిజస్ట్రేషన్లు బంద్ చేయనున్నారు. సాఫ్ట్ వేర్ లో మార్పుల కోసం రేపు తెలంగాణ అంతటా రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు.

వ్యవసాయ భూములపై 50 శాతం పెంచారు. ఎకరా భూమి ధర కనిష్టంగా 75వేలు పెంచుతూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. ఓపెన్ ప్లాట్ ధర గజానికి 200 రూపాయల మేరకు పెంచారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వం వద్ద ఉన్న భూములను తెగనమ్మాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అమ్మకాలు కూడా షురూ అయినాయి కూడా.

property market value hike GO

ప్రాపర్టీ మార్కెట్ విలువలతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం తెలంగాణ ప్రభుత్వం పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను Real Estate Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో ఒక సవివరమైన వీడియోను ఉంచారు. ఆ వీడియో లింక్ కింద ఉంది.. చూడొచ్చు.