Behind every kiss there is a meaning: మీ దృష్టిలో ముద్దు అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచటానికి ఉన్న మరో మార్గమని చెప్తారా? అలా అయితే, మీ బాయ్‌ఫ్రెండ్ ఇష్టంతో ముద్దుపెట్టాడా.. లేక ప్రేమతో ముద్దుపెట్టాడా అన్నది తెలుసుకోవటం ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే..!
పెదవులపై మీ బాయ్‌ఫ్రెండ్ పొడి ముద్దును ఇస్తే.. అది మీపై ప్రేమతో ఇచ్చినదనే అర్థం చేసుకోవచ్చు. వారు ఇంట్లోనైనా, బహిరంగంగానైనా.. పెదవులపై పొడి ముద్దులు పెడితే, మీపై గాఢ ప్రేమను చూపిస్తున్నట్లే. అలాకాకుండా, చెంపపై ముద్దు పెట్టడం అనేది స్నేహపూర్వక సంజ్ఞ. అంటే వాళ్లు నిన్ను ఇష్టపడుతున్నారే తప్ప.. ఎప్పటికీ ప్రేమించరు అని అర్థం. అదేంటి ఇష్టం, ప్రేమ ఒకటే కాదా అని అనుకుంటున్నారా? అవును రెండు వేర్వేరు. ఇష్టానికి, ప్రేమకి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాన్ని ఇష్టం ఆ గీత దాటితేనే ప్రేమ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.
నుదిటిపై ముద్దు (Kiss) పెడితే, మీపై అతడు ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నాడనీ, నీతో నిజాయితీగా ఉన్నాడని అర్థం. నీ ప్రేమను పొందటం కోసమే అతడు నీతో ఉన్నాడు కానీ, మీ శారీరక రూపం కోసం కాదని అర్థం చేసుకోవచ్చు. మీ బాయ్‌ఫ్రెండ్ మీకు నుదిటిపై ముద్దు పెట్టుకుంటే, అతడు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాని చెప్పకనే చెప్తున్నాడని అర్థం చేసుకోండి.
మెడపై ముద్దు పెట్టాడంటే.. మీరు లేకుండా అతడు ఉండలేడు. ఎప్పుడూ నీ ఆలోచనలోనే మునిగితేలుతున్నాడని అర్థం. చేతులపై ముద్దుపెట్టుకుంటే(Kiss), అతడు ఓ రకమైన ప్లేబాయ్‌గా చెప్పుకోవచ్చు. తన ఆకర్షణీయమైన వలలోకి లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఇది ఓ రకంగా మిమ్మల్ని పొందటానికి పురుషులు ఉపయోగించే ఉపాయాలలో ఇదొక టెక్నిక్ అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ కిస్ పెడితే, అతడు మీకోసం ఏదైనా చేస్తారని అర్థం. ఫ్రెంచ్ కిస్ ఆకర్షణ, కోరికకు చిహ్నంగా చెప్తారు. అతడు మిమ్మల్ని మంచి అభిరుచితో ముద్దుపెట్టుకుంటే, కచ్చితంగా అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పుకోవచ్చు.