pets and childrens :పిల్లలు ఉన్న ఇంట్లో పెంపుడు జంతువులా… ఈ టిప్స్‌ పాటించండి

-

pets and childrens at home Follow these tips: ఇప్పుడు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం కామన్‌గా మారిపోయింది. ఒకటి కంటే ఎక్కువ జంతువులను పెంచుకోవటం పరిపాటిగా మారింది. కొందరు పెట్స్‌పై ఇష్టంతో పెంచితుంటే.. మరికొందరు స్టేటస్‌ సింబల్‌గా పెంచుతారు. ఏది ఏమైనా ఇంట్లో పిల్లల్లా సందడి చేస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ప్రేమను అందిస్తాయి పెంపుడు జంతువులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇంట్లోకి మరొక బుల్లి పాపాయో, బుల్లి బుజ్జాయో వచ్చినప్పుడు, పెట్స్‌ను దూరం పెట్టాలా.. అని ఆలోచిస్తున్నారా.. లేదా బ్లూక్రాస్‌ వాళ్లకో, పెంపుడు జంతువు సంరక్షణ వారికో ఇచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారా? సంవత్సరాలు తరబడి పెంచిన ప్రాణులను దూరంగా పెట్టడం మీ వల్ల కావటం లేదా..? అయితే ఈ టిప్స్‌ మాటించండి.. మీ బుజ్జాయికి కూడా పెంపుడు జంతువులను అలవాటు చేయండి..!

- Advertisement -

ముందు మీ పెంపుడు జంతువుకు చెప్పండి..!
మీరు పెంచే కుక్క, లేదా పిల్లికో.. మీతో అనుబంధం ఏర్పడే ఉంటుంది. మీరు చెప్పే మాటలను అవి వింటూనే ఉంటాయి. అటువంటప్పుడు.. ఇంట్లోకి వచ్చిన మీ బేబీని వాటికి చూపించండి.. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనీ వాటికి అర్థం అయ్యేటట్లు చెప్పండి. అలాగే.. బేబీ కోసం కొన్ని రోజులు బెడ్‌ రూమ్‌కు దూరంగా ఉండమని సముదాయించండి. మీతో మంచి అనుబంధం ఉండి ఉంటే.. కచ్చితంగా మీ మాట వింటాయి. రోజుల వ్యవధి ఉన్న బేబీను పెంపుడు జంతువులకు కొంచెం దూరంగా ఉంచటం మంచిది. ఈ సమయంలోనే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.. కొన్నికొన్ని సార్లు పెంపుడు జంతువుల గాలి వల్ల.. ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నెలలు వచ్చే వరకు.. పెంపుడు జంతువులను దూరంగానే ఉండనివ్వండి. ఇందుకోసం ముందు నుంచే వాటికి మీరు చెప్తూ ఉండటం చేయాలి.

పిల్లలను వాటితో టైమ్‌ స్పెండ్‌ చేయనివ్వండి (pets and childrens)
పిల్లలకు మూడు నెలలు దాటిన నుంచి.. క్రమంగా తన పరిసరాలను పరిశీలించటం మెుదలుపెడతారు. తన చుట్టూ ఏం జరుగుతుందో అని గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని అనుకరించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచే పెంపుడు జంతువుల గురించి మీ పిల్లలకు చెప్తూ ఉండండి. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ వంటి గ్యాడ్జెట్లు అలవాటు చేయకుండా.. పిల్లల పక్కన పెంపుడు జంతువులను ఉంచి.. పిల్లలకు అలవాటు చేయండి. మీతో పాటే.. మీ పెంపుడు జంతువులకు కూడా, బెడ్‌రూమ్‌లో పక్కను ఏర్పాటు చేయండి.. దీని వల్ల.. అవి కూడా మనలాగే అన్న భావన పిల్లలల్లో నాటుకుపోతుంది.

జాగ్రత్తలు పాటించండి
చిన్నప్పటి నుంచే పిల్లలు పెంపుడు జంతువులకు బాగా అలవాటు పడితే.. వారు అస్సలు వాటిని జంతువులుగా చూడలేరు. మనలో ఒకరిలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పెంపుడు జంతువులను తాకేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుక్క, పిల్లి వంటివి వాటి తోకలను తాకడాన్ని అస్సలు ఇష్టపడవు. గడ్డం కింద చెక్కిల గింతలు పెడితో పరవశించిపోతాయి. ఈ తేడాలను పిల్లలకు వివరించండి. మనలాగే వాటికి కూడా ఫీలింగ్స్‌ ఉంటాయనీ, నొప్పి, బాధ, సంతోషం కలుగుతాయని పిల్లలకు వివరించండి. పెంపుడు జంతువులతో ఆడుకోనివ్వండి. దీనివల్ల పిల్లలు చాలా యాక్టివ్‌గా తయారవుతారు. చలాకీగా జంతువులతో పాటు తిరుగుతుండటం వల్ల, ఆహారాన్ని సైతం తగిన మోతాదులో తింటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...