Relationship better than Lonliness: ఏ బాధ లేకుండా.. ఎటువంటి బాంధవ్యాలు లేకుండా.. ఒంటరిగా బతకటం సులువు అనుకోవటం చాలా పొరపాటు. ఒంటరితనం అనుభవించటం నిజంగా అత్యంత కష్టమైనది, దుర్భరమైనది కూడా. ఒంటరితనం వల్ల మానసిక సమస్యలే కాదు.. శారీరక సమస్యలు కూడా బాధపెడతాయి. ఒంటరితనానికి, ఏకాంతంగా ఉండటానికి చాలా తేడా ఉంటుందని అర్థం చేసుకోవాలి.
ఒంటరితనం అంటే కనీసం సంతోషం వచ్చినా.. బాధ వచ్చిన మనస్ఫూర్తిగా వ్యక్తపరచేందుకు వ్యక్తి లేకపోవటం. ఇతరులతో కలవాలని లేనప్పుడు కోరుకునేది ఏకాంతం అని అర్థం చేసుకోవాలి. ఒంటిరతనంగా ఉండటం వల్ల రోజుకు 15 సిగరెట్లు తాగటం వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం (Lonliness) మెుదటిగా రోగనిరోధక శక్తిని క్రమంగా తగ్గించేస్తుందంట. ఒత్తిడితో సమతమవ్వటంతో.. గుండె జబ్బులు, బీపీ వంటి వ్యాధుల బారిన పడేటట్లు ఒంటరితనం దోహదపడుతుందని వైద్యులు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, రోజువారి ఇబ్బందులు ఒంటరితనంలో మరింత బాధిస్తాయని నిపుణులు తెలిపారు.
ఒంటరితనాన్ని పోగొట్టేందుకు సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడకండి. ఎందుకంటే.. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని తెలుసుకోండి. ఇంటి చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండటం, వారితో మంచిగా మెలగటం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు అపార్టుమెంట్లలలో నివసిస్తుంటే.. ఫ్లోర్‌లో ఉండే వారితో స్నేహం చేయండి. ఇష్టం లేకపోయినా స్నేహితులను ముఖాముఖిగా కలవటానికే ప్రాధాన్యం ఇవ్వండి. దీనివల్ల రోజువారి జీవన శైలిలో మార్పులు వస్తాయి.
మనస్సుకు సాంత్వన చేకూరే అవకాశం ఉంటుంది. రక్తసంబంధీకులు లేకపోతే.. బంధువులైనా ఉండి ఉంటారు కదా.. వారితో బంధాన్ని కొనసాగించండి. ఒంటరితనం(Lonliness)తో బాధపడే వారికి బంధువులతో కలవటం ద్వారా.. కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ లీగ్‌లో చేరటం, ఆటలు ఆడటం శరీరానికి ఎంతో మంచిది. వీటి వల్ల ఒకే గదిలో ఉండటం వల్ల శరీరంలో వచ్చిన మార్పులు, బద్దకం వంటివి దరిచేరవు. కమ్యూనిటీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి. మొహమాటంగా ఉంటే.. కొంతమందితో కలిసి.. గ్రూప్‌గా కలిసి కట్టుగానైనా పాల్గొనండి. ఈ కార్యక్రమాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. కుటుంబానికి దూరంగా ఉండటం కంటే.. బంధాన్ని ధృడపరుచుకునేందుకే చూడండి. బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు మామూలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.