Happy Relationship | భార్యాభర్తల మధ్య ఒక్కోసారి సరదాగా మాట్లాడుకునే మాటలు… పెద్దవై గొడవలుగా మారుతుంటాయి. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు… ప్రతి చిన్నవిషయానికి గొడవలు పడుతుంటే ఇల్లు నరకంగా మారుతుంది. ఇలాంటప్పుడు వివాదం ముదరకుండా ఇద్దరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సరదాగా వచ్చినా, మాట తూలినందుకైనా.. ఆ సమస్యను సమస్యగానే చూడండి. తాత్కాలికంగా జరిగిన గొడవకు గతంలో జరిగిన పొరబాట్లతో ముడిపెట్టొద్దు. ముందు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించండి. పొరబాట్లు అందరివల్లా జరుగుతాయి. నిజంగా అది దిద్దుకోలేని పొరబాటనే మీరు దూరంగా ఉంటున్నారా? అనేది గమనించుకోండి. అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Happy Relationship | గొడవకి కారణం ఏదైనా ఇద్దరికీ ఎవరి వాదనలు వారికి ఉంటాయి. కొన్నిసార్లు నిజంగానే అక్కడ తప్పు జరగకపోయినా ఆవేశం, అహం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేస్తుంది. వాదులాటే ఇలా పెరగడానికి ప్రధాన కారణం కావొచ్చు. ఇలాంటప్పుడు మాటకు మాటగా… వెంటనే స్పందించేయక్కర్లేదు. మౌనంగా ఉండండి. లేదంటే, ఆవేశంలో అనే మాటలు సమస్యను మరింత పెద్దవిగా మారుస్తాయి. ఒకవేళ ఒక మాట పడినా తప్పేం లేదు… కాస్త వేడి చల్లారాక మీ అభిప్రాయాన్ని అవతలివారికి అర్థమయ్యేలా చెప్పి చూడండి. అర్ధం చేసుకుంటారు.