Sexual Health |మనిషి ఆరోగ్యానికి, ఆనందానికి.. భార్యాభర్తల అనుబంధానికి శృంగార జీవితం కీలకం. అయితే ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు కలయిక పట్ల నిరాసక్తత చూపుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం ధరించడం, ప్రసవానంతర ఒత్తిళ్లు, మెనోపాజ్.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయంటున్నారు. వీటివల్ల రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏళ్ల పాటు లైంగిక కోరికల జాడ కానరావట్లేదని కొంతమంది మహిళలు తమ వద్దకొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నిజానికి శృంగారమే కదా అని మనం తేలిగ్గా తీసుకుంటాం.. కానీ దీన్ని తరచూ ఆస్వాదించడం వల్ల ఎంతటి సత్ఫలితాలుంటాయో.. నెలల తరబడి వాయిదా వేయడం వల్ల అంతే ఎక్కువగా దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, అవేంటో తెలుసుకుందాం రండి.
Sexual Health |చాలామంది మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే తరచూ శృంగారంలో పాల్గొనే మహిళలతో పోల్చితే.. లైంగిక కోరికలు తగ్గిన వారిలో, రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉన్న వారిలో ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు, అదెలాగంటే, గర్భాశయం ఒక కండరంలా పనిచేస్తుంది. లైంగిక కోరికలు కలిగినప్పుడు అది సంకోచించి రక్తాన్ని సులభంగా బయటికి పంపిస్తుంది. తద్వారా నొప్పి తీవ్రత కూడా తగ్గుతుందట! సాధారణ సమయంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది.. కాబట్టి బ్లీడింగ్ అయ్యే క్రమంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాగే శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. వీటిని నొప్పి నివారిణులు అని కూడా అంటారు. తద్వారా నెలసరి నొప్పులే కాదు.. ఇతర శారీరక నొప్పుల తీవ్రత కూడా తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల తగ్గుతుందంటున్నారు నిపుణులు.
Read Also:
1. సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat