Shivaratri Prasadam Recipes: మహాశివరాత్రి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం చేసి ఉదయం శివుడ్ని దర్శనం చేసుకోవాలి, తర్వాత స్వామికి అరటి పండు కొబ్బరికాయని దేవాలయంలో సమర్పించండి, ఇక వాటిని పేదవారికి పంచిపెడితే మంచిది.. ఎట్టి పరిస్దితిలో ఆ ప్రసాదం పడవేయవద్దు, ఇక అభిషేకం చేయించుకున్న జలాన్ని ఇంటికి నలువైపులా చల్లుకుంటే చాలా మంచిది ..వ్యాపార వృద్దికి చిలకరించండి.. నలువైపులా వ్యాపారం ఉన్న చోట ఈ నీరు చల్లండి.
మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగా కార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇక మారేడు దళాలతో ఇంటిలో గుడిలో పూజించండి, అలాగే అభిషేకానికి కేవలం ఆవుపాలు మాత్రమే వాడండి.
భోళాశంకరుడి ఇలా పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను పటించండి, ఆరోజున ఉపవాసం అలాగే రాత్రి అంతా జాగరణ చేయండి. ఇలా చేస్తే మీకు ఐష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
Read Also:
- శివరాత్రికి ఈ 7 రకాల పూలతో పూజ చేస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది
-
శివరాత్రి రోజున ఇలా పూజిస్తే కోటి జన్మల ఫలం.. తప్పక తెలుసుకోండి