Shiva Puja: శివుడుకి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన పుష్పాలు తెలుసుకుందాం.. ముందుగా మారేడు దళాలు ఇవి శివుని పూజల్లో కచ్చితంగా ఉంటాయి.. వీటిని త్రిమూర్తులకి చిహ్నంగా చెబుతారు ,వీటితో పూజిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, వెండి బంగారు పూలకంటే స్వామికి మారేడు దళాలే ఇష్టం.. అలాగే మరో పుష్పం నాగమల్లి పుష్పం.. శివునికి అత్యంత ఇష్టమైనదీ పుష్పం.. దీనితో శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడు అని పండితులు చెబుతారు.
Shiva puja: ఇక మనం చూస్తు ఉంటాం పెరట్లో కొన్ని నర్సరీల్లో పెంచుతారు అవే శంఖం పూలు.. ఇవి కేవలం శివుడికి మాత్రమే పెట్టి పూజిస్తారు,చూడటానికి ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు. అలాగే జిల్లేడు పుష్పాలు వల్ల మనుషుల్లో ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానూ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వ జన్మలో చేసి పాప కర్మలు నశించిపోతాయంటారు.
ఇక చాలా మంది సంపెంగ పూలని దేవుడికి ఇస్తారు.. వీటి సువాసన దేవతలకి చాలా ఇష్టం.. శివుడికి ఇవి కూడా పూజకి వాడతారు…గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ రంగును త్యాగానికి గుర్తుగా భావిస్తారు.ఇక మల్లెలు కూడా శివుని అలంకరణకు వాడతారు.. ఇవి చాలా సుందరంగా ఉంటాయి.. పరిసరాలతో పాటు మనసు బాగుంటుంది. శివుడికి మల్లెలు కూడా ఇష్టమే అంటారు.
which flowers to be used for lord shiva puja