Shivaratri Pooja: శివుడు అభిషేక ప్రియుడు అంటారు.. ఆయనకు కాస్త చెంబుడు నీరు అభిషేకం చేసినా ఆయన ఎంతో ఆనందిస్తారు.. ధనం పళ్లు పుష్పాలు ఇలాఏమీ ఆయన ఆశించడు… కేవలం ఆయన చెంబుడు నీటితో అభిషేకిస్తేనే ఆనందపడతాడు అంటారు పండితులు..శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి పౌరోహితులకు దానం చేస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది అని పండితులు చెబుతారు.
Shivaratri Pooja: అంత స్థోమత లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట. అయితే మహాశివరాత్రి రోజున శివుడికి అత్యంత ప్రీతకరమైన పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక స్వామికి ధనికుడుగా ఉన్న వారు వారికి ఉన్న ధనంతో బంగారం వెండి ఆభరణాలు చేయిస్తారు.
పేదలు ఏమీ లేకపోయినా స్వామికి ఆవుపాలతో అభిషేకం లేదా నీటితో అభిషేకం ఉదయం చేయిస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు, శివరాత్రి రోజున స్వామి అనుగ్రహం కోసం కోట్లాదిమంది శివాలయాల్లో అభిషేకాలు చేయిస్తారు.. ఆ అభిషేకం చేయించిన జలం తలపై చల్లుకుంటే స్వామి ఆశీస్సులు కలుగుతాయట.