యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డున పడడం కాదు. ఓ కుటుంబమే రోడ్డున పడడం. ఈ రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి ఇంటికొచ్చే వరకు కుటుంబీకులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కాగా గత నెల (ఆగష్టు) 28న వంగూరు మండలం కిష్టంపల్లి తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలుమలపల్లి TRS గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డమీది మల్లేష్ 36 సం. మరణించారు. గడ్డమీది మల్లేష్ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
కాగా మల్లేష్ తన పాఠశాల జీవితాన్ని జెడ్పిహెచ్.ఎస్ ఉప్పునుంతలలో గడిపారు. 2005-2006 లో టెన్త్ క్లాస్ ను పూర్తి చేసుకున్నాడు. ఈరోజు మల్లేష్ టెన్త్ క్లాస్ మిత్రులు బాధిత కుటుంబాన్ని కలిసి దైర్యం చెప్పారు. కాగా మల్లేష్ తో ఉన్న తీపి అనుభవాలను అతని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. ఈ మధ్యే గెట్ టు గెదర్ పార్టీని మల్లేష్ వ్యవసాయ క్షేత్రంలోనే చేసుకున్నామని, మల్లేష్ ఎప్పుడు తమ మనసులోనే ఉంటాడని చెప్పుకొచ్చారు. మల్లేష్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని వారు వాపోయారు.
కేవలం సంతోషంలోనే కాదు కష్టకాలంలోనూ మల్లేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మల్లేష్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆ కుటుంబానికి రూ.52,000 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మల్లేష్ పాఠశాలలో మంచిగా ఉండేవాడని, అందరితో హుందాగా మాట్లాడేవాడిని అతని మిత్రులు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆర్ధిక సహాయం చేసిన వారిలో శ్రీశైలం, రఫీ, జంగయ్య, శ్రీకాంత్ రెడ్డి తమ పెద్ద మనసును చాటుకున్నారు.
ఆర్ధిక సహాయం అందజేసిన వారి పేర్లు..
1. Rafi – 5000
2. Nirajan goud – 2000
3. M.Thirupathi -2000
4.Sai Ram – 2000
5. Jangaiah – 3000
6. Vishnu – 2000
7. Naresh Dj – 2000
8. G.shekar – 2000
9. Venkat Yadav -2000
10. A Nagaraju -2000
11.Balraju -2000
12. U. Srisailam – 5000
13.veeraiah goud – 2000
14.ramesh Kspl – 2000
15.m.Ravi upnl- 2000
16. Peddaiah – 2000
17. E .Srinu -2000
18. M. Shiva UPNL -2000
19.B.Mahesh upnl-2000 20.Devi sing- 2000
21. Sreekanth Reddy – 3000
22.D. Srikanth – 2000
Total amount Received – 52,000/-