60 ఏళ్ల వయసులో గుడ్లు పెట్టిన కొండచిలువ ప్రపంచంలో వండర్

60 ఏళ్ల వయసులో గుడ్లు పెట్టిన కొండచిలువ ప్రపంచంలో వండర్

0
62

ఏ జంతువు అయినా ఏ మనిషి అయినా సృష్టిలో పిల్లలని కంటాయి, అయితే వాటికి తోడు ఉంటేనే ఇలా జన్మ ఇవ్వడం జరుగుతుంది, అయితే లేటు వయసులో ఓ కొండచిలువ గుడ్లు పెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది, దీంతో అందరూ షాక్ అయ్యారు.

అవును సాధారణంగా కొండచిలువలు గుడ్లు పెడతాయి. మిస్సోరీలోని సెయింట్ లూయీస్ జూ లో ఓ కొండచిలువ వయసు 62 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి ఆ కొండచిలువ ఒక్కటీ ఏ తోడూ లేకుండా ఉంటోంది. మరి 20 ఏళ్లుగా తోడు లేకుండా ఉన్నా ఈ ఏడాది తాజాగా ఇప్పుడు ఈ ఆడ కొండచిలువ గుడ్లు పెట్టింది ఇది చూసిన జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

సాధారణంగా ఈ పైథాన్ లు 60 ఏళ్ల వయసులోనే పునరుత్పత్తి ఆపివేస్తాయి. అయితే, ఇప్పడు 62 ఏళ్ల వయసులో ఈ కొండ చిలువ గుడ్లు పెట్టడం పై జూ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. అయితే మగతోడు లేకుండా ఎలా జరిగింది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.

కొంత వీర్యాన్ని తమలో నిలువ ఉంచుకుంటాయి అని ఇలా జరిగిన సమయంలో ఎక్కడో కొన్ని పాముల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అని చెబుతున్నారు వైద్యులు, ఐదు గుడ్లు పెడితే అందులో రెండు చెడిపోయాయి, మిగిలిన మూడు బాగున్నాయి అంటున్నారు.