ఆ ఒక్క కుటుంబమే రూ.80,357 కోట్ల పన్నులు చెల్లించనుంది

ఆ ఒక్క కుటుంబమే రూ.80,357 కోట్ల పన్నులు చెల్లించనుంది

0
28

సాధారణంగా ధనవంతులు తమ వ్యాపారాల మీద సంపాదించిన సంపద మీద పన్ను కడుతూ ఉంటారు.. అయితే ఒక్కోసారి కొందరు వేల కోట్ల రూపాయల ఐటీ కూడా కడుతూ ఉంటారు.. కాని ప్రపంచంలో మొదటిసారి ఓ కుటుంబం ఏకంగా 80 వేల కోట్ల రూపాయల పన్నులు కడుతోంది, మరి ఎవరు ఆ కంపెనీ ఏమిటి అనేది చూద్దాం..

 

 

ప్రభుత్వానికి రూ.80,357 కోట్ల పన్నులను కట్టనుంది శాంసంగ్ కుటుంబం..ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్నులు కట్టిన కుటుంబంగా చరిత్ర సృష్టించనుంది.. శాంసంగ్ సంస్థల అధిపతులు. సంస్థ మాజీ చైర్మన్ లీ కున్ హీ కుటుంబం ఆ పన్నును చెల్లించాలని నిర్ణయించింది.

 

1,080 కోట్ల డాలర్లను దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెల్లించనుంది. గత ఏడాది లీ కున్ హీ చనిపోవడంతో.. ఆయన సంపాదించిన సంపదలోని సగ భాగాన్ని వారసత్వ పన్నుగా చెల్లించాలని ఆయన భార్యాపిల్లలు నిర్ణయించినట్టు శాంసంగ్ ఈరోజు ప్రకటించింది. ఈ నిర్ణయం పై ప్రపంచంలో ఉన్న బిజినెస్ టైకూన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు.

 

మొత్తం వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆరు విడతలుగా ఈ నగదు పన్నుగా చెల్లిస్తారు…

లీ కూడబెట్టిన 23 వేల కళాఖండాలను ప్రభుత్వానికి అందించనుంది.

కళాఖండాల్లో నేషనల్ ట్రెజర్స్, పెయింటింగ్స్ ను ఇవ్వనుంది. ఈ నిర్ణయం పై చాలా మంది మంచి నిర్ణయం అని అభినందిస్తున్నారు.