ఆ ఒక్క మెసేజ్ ఎంగేజ్ మెంట్ అయిన పెళ్లిని ఆపేసింది

ఆ ఒక్క మెసేజ్ ఎంగేజ్ మెంట్ అయిన పెళ్లిని ఆపేసింది

0
98

ఓ యువ‌కుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఈ స‌మయంలో అత‌నికి 50 వేల జీతం కావ‌డంతో వారి ఇంట సంబంధాలు చూస్తున్నారు, అయితే అదే ఊరిలో ఓ సంబంధం ఉండ‌టం అమ్మాయి అందంగా ఉండ‌టం ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డంతో పెళ్లి చూపుల‌కి ర‌మ్మ‌న్నారు. ఇత‌ను ఉద్యోగానికి సెల‌వు పెట్టి అమ్మాయిని చూశాడు.

అయితే ఆ అమ్మాయికి కూడా హీరోయిన్ ని మించిన అందం ఉండ‌టంతో చూడ‌గానే ఒకే చెప్పాడు.. ఇక వారి లాంచ‌నాలు అయ్యాక ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు, అయితే ఈ స‌మ‌యంలో ఆ పెళ్లి కొడుక్కి వారం త‌ర్వాత ఓ మెసేజ్ వ‌చ్చింది.. ఇది నీకు కాబోయే భార్య నాకు గంట క్రితం పంపిన మెసేజ్ అని దాని సారాంశం.

ముందు చూసి ఎడిటింగ్ మెసేజ్ అనుకున్నాడు, ఆమెకు నీతో పెళ్లి ఇష్టం లేద‌ని త‌ను నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్పాడు.. దీంతో అత‌ను మోస‌పోయాను అని గ్ర‌హించి వెంట‌నే వారి పెళ్లి ర‌ద్దు చేసుకున్నాడు, ఇంత‌కీ ఆమె ఇంజ‌నీరింగ్ చ‌దువుతుంటే ఆ యువ‌కుడు అదే ఏరియాలో ఆమెని ఆటోలో కాలేజీకి తీసుకువెళ్లే వ్య‌క్త‌ట.. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు అని తేలింది, దీంతో వివాహం క్యాన్సిల్ చేసుకున్నారు.