అదృష్టవంతుడు 20 లాటరీలు తగిలాయి ఎంత గెలిచాడంటే

అదృష్టవంతుడు 20 లాటరీలు తగిలాయి ఎంత గెలిచాడంటే

0
125

కొందరు అదృష్టవంతులకి సమయం వారి చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది, వద్దు అనుకున్నా ఆ లక్కీ ఛాన్స్ వస్తూనే ఉంటుంది, నిజమే కొందరు లాటరీ టికెట్లతో కుబేరులు అయిన వారు ఉన్నారు, కూలి నాలి చేసుకునే వారు కూడా ఈ లక్కీ ఛాన్స్ తో లాటరీ తగిలి కోట్లు గెలుచుకున్నారు.

లాటరీలు పుణ్యమా అంటూ కోటీశ్వరులు అవుతున్నారు లాక్ డౌన్ సమయంలో … టైంపాస్, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని కొన్న టికెట్లు వారిని జమిందారులను చేస్తున్నాయి. ఓ వ్యక్తి ఇరవై లాటరీ టికెట్లు కొన్నాడు, అయితే అవి పలు సిరీస్ లకు సంబంధించిన టికెట్లు.

వర్జీనియా సౌత్బోస్టన్కి చెందిన టోనీమైల్స్ అనే వ్యక్తి, ఒక్కో లాటరీ టికెట్ను 5 వేల డాలర్లు పెట్టి కొన్నాడు. దీంతో లక్ష డాలర్లు బహుమతిగా పొందాడు. అంటే సుమారు 73.24 లక్షలు గెలుచుకున్నాడు. అయితే అన్నీ సిరీస్ లలో లక్కీ డ్రా అతనికే తగిలింది నిజంగా ఆ లాటరీ కంపెనీ కూడా ఆశ్చర్యపోయింది.