ఏపీ, తెలంగాణకు అలెర్ట్..2 రోజుల పాటు భారీ వర్షాలు

0
128

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతతో కూడిన ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే 2 లేదా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

ఏపీలో కోస్తాంధ్రతో పాటు కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు అనే చెప్పుకోవాలి.