ఏపీ ప్రజలకు అలెర్ట్..3 రోజుల పాటు వర్షాలు

0
83

ఏపీలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. దీంతో వాయుగుండం ఈరోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఒక‌టి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపుల‌తో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఒకటి రెండు చోట్ల ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు రేపు , ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చునని తెలిపింది.

రాయలసీమ: ఈరోజు రేపు , ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈరోజు ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించవచ్చని పేర్కొంది.