పరీక్షలు రాసే అభ్యర్థులకు అలెర్ట్..నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

0
104

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గ‌చ్చిబౌలి స్టేడియం వ‌ర‌కు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమ‌ల్లో ఉండ‌నున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మారథాన్‌ నెక్లె్‌స్‌ రోడ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ఎంజే కాలేజ్‌, కేబీఆర్‌ పార్కు, జూబ్లీచెక్‌పోస్ట్‌, రోడ్‌నెంబర్‌ 45, కేబుల్‌ బ్రిడ్జిమీదుగా బాలయోగి స్టేడియం చేరుకుంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 4.30 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుండనున్నాయి. ఆదివారం జేఈఈ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలు జరుగుతుండడంతో ఆయా రూట్లలో ప్రయాణించే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జాయింట్‌ సీపీ సూచించారు.