హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు భాగ్యనగరంలో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు. నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దైన రైళ్ల వివరాలు ఇలా..
లింగంపల్లి టు హైదరాబాద్ మార్గంలో 9 రైళ్లను రద్దు చేస్తున్నారు.
అలాగే హైదరాబాద్ టు లింగంపల్లి 9 రైళ్లు, ఫలక్ నూమా టు లింగంపల్లి ఏడు రైళ్లు, లింగంపల్లి టు ఫలక్నామ 7 రైళ్లు, సికింద్రాబాద్ టు లింగంపల్లి మార్గంలో ఒకటి మరియు లింగంపల్లి టు సికింద్రాబాద్ మార్గంలో ఒక రైలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ ప్రయాణికులు తమ ప్రయాణాలను ఇతర మార్గాల ద్వారా చేసుకోవాలని కోరారు. కాగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనితో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.