కొత్త సిమ్‌కార్డు తీసుకునే వారికి అలర్ట్..ఇకపై కొత్త నిబంధనలు

0
86

మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం మొబైల్‌ వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటి ప్రకారం కొంతమందికి మొబైల్ కనెక్షన్ పొందడం సులభం,మరికొంతమందికి  మాత్రం చాలా కష్టమవుతోంది. ఇంకొదరైతే కొత్త సిమ్‌ని అస్సలు పొందలేరు. నిబంధనల ప్రకారం కొత్త మొబైల్ కనెక్షన్ కోసం స్టోర్‌లకి వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సిమ్ కార్డ్ డైరెక్ట్‌గా ఇంటికే చేరుతుంది.

ఇప్పుడు టెలికాం కంపెనీలు18 ఏళ్లలోపు వినియోగదారులకు కొత్త సిమ్‌ను విక్రయించలేవు.18 ఏళ్లు పైబడిన కస్టమర్లు మాత్రం కొత్త సిమ్ కోసం ఆధార్‌ చూపించి తీసుకోవచ్చు. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డ్‌లను విక్రయించదు. అంతేకాకుండా ఒక వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే అతడికి కూడా కొత్త సిమ్ కార్డ్ విక్రయించకూడదు

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ స్టోరీ యాజమానిని దోషిగా టెలికామ్ కంపెనీ పరిగణిస్తుంది. అలాగే ప్రీ పెయిడ్‌ ను… పోస్ట్‌ పెయిడ్ గా మార్చుకోవడానికి కొత్త వన్ టైం పాస్ వర్డ్ ఆధారిత ప్రక్రియ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.