శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

0
91

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తున్న క్రమంలో తాజాగా  శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి కల్యాణోత్సవం, ఉంజల్ సేవ టిక్కెట్లు, ఆగస్టు నెల ఆర్జిత బ్రహ్మొత్సవం,సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు విడుదల చేసింది.

ఈనెల 26న మ. 3గంటలకు వరకు టిక్కెట్ల నమోదు అవకాశం కల్పించింది. ఈనెల 26న సా. గంటలకు ఆన్ లైన్ డిప్ తీసి టిక్కెట్లు కేటాయించనుంది. భక్తులు టికెట్లను బుక్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడంతో పాటు..కరోనా నిబంధనలను పాటించడం మంచిదని వెల్లడిస్తున్నారు.