శ్రీవారి భక్తులకు అలెర్ట్‌..ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల విడుదల

0
89

శ్రీవారి భక్తులకు అలర్ట్..క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020 నుంచి శ్రీ వారి అర్జిత సేవ‌ల‌ను నిలిపివేశారు. కాగ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం పెట్టిన నేప‌థ్యంలో శ్రీ వారి అర్జిత సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి శ్రీ‌వారి ఆల‌యంలోఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభం కానున్నయి. కాగ ఏప్రిల్, మే, జూన్ మూడు నెల‌ల‌కు సంబంధించి అర్జిత సేవ‌ల టికెట్ల‌ను టీటీడీ నేటి నుంచే అందు బాటులోకి తీసుకురానున్నారు.

ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో అర్జిత సేవల టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. నేడు ఉద‌యం 10 గంటల నుంచి 22వ తేదీ ఉద‌య 10 గంట‌ల వ‌ర‌కు ఆన్ లైన్ లో టికెట్లు ల‌భ్యం అవుతాయి. అర్జిత సేవ‌ల టికెట్ల కోసం కేవ‌లం రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌నుంది. కాగ అర్జిత సేవా టికెట్లును ఎల‌క్ట్రానిక్ లాట‌రీ ప‌ద్ద‌తి ద్వారా భ‌క్తుల‌కు కేటాయిస్తారు. కాగ శ్రీ వారి అర్జిత సేవ‌ల టికెట్లు పొందిన వారి వివ‌రాల‌ను 22వ తేదీన ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత టీటీడీ విడుద‌ల చేస్తుంది.

అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు సేవల ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. అయితే ప్రత్యేక రోజుల్లో అంటే పండుగ సందర్భాల్లో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.