తెలంగాణకు అలెర్ట్..ఆ 5 జిల్లాలకు భారీ వర్ష సూచన..ఆరెంజ్ అలెర్ట్ జార

0
38

గత 2,3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైద్రాబాద్,మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక తాజాగా ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.