శ్రీవారి భక్తులకు అలెర్ట్..తిరుమల గిరిపై ఈ నిబంధనలు తప్పనిసరి..అవి ఏంటంటే?

0
111

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. గరుడసేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది.

అలాగే తిరుపతి క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ స‌ర్వద‌ర్శనం మాత్రమే అమ‌లు చేయనున్నారు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపి బ్రేక్ ద‌ర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక ద‌ర్శనం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

గ‌రుడ‌సేవ రోజున అదనంగా బస్సులు ఏర్పాటు చేయనున్నారు. తిరుప‌తి ఘాట్ రోడ్లలో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం విధించినట్లు తెలిపారు. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ  చేపట్టనున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.