విద్యార్థులకు అలెర్ట్..నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

0
112
AP Inter exams Schedule

ఏపీలో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదల చేశామని అధికారులు వెల్లడించారు.

కాగా పదో తరగతి ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 70.70 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64.02 శాతం మంది పాసయ్యారు. ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది ఉత్తీర్ణత కాగా అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం మంది పాసయ్యారు.